Page Nav

HIDE

Grid

GRID_STYLE

Breaking News

latest

Arranged Love VS Love Arranged (CHAPTER - 1)

Hi, Love-Magics Readers Welcome to Our Website We are Writing a Sweet & Romantic  Story. This Story Is Written By  Yashwanth Tharra &...

Hi, Love-Magics Readers Welcome to Our Website We are Writing a Sweet & Romantic  Story. This Story Is Written By  Yashwanth Tharra & Kumar Swami Shinagam.
Note: If You Want to Publish Your Love Story Message Join Our Love Magics Group And Publish Your Story For Free ( Click Here )                                                                                              

అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో జీవనోపాధి కోసం వలసలు పెరుగుతున్న రోజులవి. కొత్తగా ఏర్పడిన పరిశ్రమలతో అందాలను రూపుదిద్దుకుంటున్న ఈ నగరంలో ఓ జీవన ప్రయాణానికి నాంది పలికింది.

విదేశీ కంపెనీ అయిన "ROY INFOTRCH"  హైదరాబాద్ లో 30,000 కోట్లతో పెట్టుబడులు మొదలుపెట్టి విజయవంతంగా ముందుకు సాగిపోతుంది. అప్పుడే Degree complete చేసి సమాజంలోకి వచ్చిన సాగర్  తన ప్రతిభతో “ROY INFOTECH” లో ఉద్యోగం సంపాదించాడు. నెలకు 25,000 జీవితంలో తనకంటూ ఒక గుర్తింపుని, గౌరవాన్ని సంపాదించుకున్నాడు.

ప్రతిరోజు సాగిపోతున్న తన జీవన విధానంలో విధి కలిపిన చెలిమిలో సాగర్ మరియు కుమార్ పాలుపంచుకున్నారు. తొలి పరిచియాలే మధుర జ్ఞాపకాలై, విధి ఏర్పరచిన బంధాన్ని బాధ్యతగా తీసుకుంటూ, ప్రతిక్షణం ఆ చెలిమిలో సంతోషాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగిపోతున్నారు.

అది డిసెంబర్ మాసం, చలికాలం, చంద్రుడు మరింత చల్లదనాన్ని ప్రసాధిస్తున్న రోజు అది. సాగర్ ఆరుబయటకు వచ్చి, ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఫోన్ మ్రోగడంతో ఎదో ఫోన్ కాల్ వచ్చిందని అనుకుని కాల్ లిఫ్ట్ చేసాడు. తన ఇంటినుండి వచ్చిన ఫోన్ కాల్ సంభాషణలో కష్టసుఖాలను వివరించుకుంటాడు. ఇంతలో తనకు పెళ్లి సంబంధం కుదిరిందని తల్లిదండ్రులు చెప్పడంతో వారి కోరిక మేరకు శ్రీకాకుళం బయలుదేరుటకు సిద్ధపడతాడు. మరుసటిరోజు ఆఫీసుకి వెళ్లి, తన మిత్రుడు కుమారుకు జరిగిందంతా వివరించి, తన విధిని త్వరగా నిర్వర్తించి, లీవ్ తీసుకొని త్వరగా తన Room కు చేరుకుంటాడు.

సమయం : 07:13pm:
తను ఎక్కవలసిన బస్సు బయలుదేరే సమయం 09:45pm, ప్రయాణానికి కావలసిన సదుపాయాలన్ని సమకూర్చుకుంటున్నాడు. వదిలి వెళ్లలేని బంధం ఒకవైపు, కొత్తగా ఏర్పడబోతున్న  బంధం మరోవైపు, బాధలను సంతోషాలను ఒకేసారి అనుభవిస్తూ ప్రయాణానికి ముందుకు సాగాడు. 15 నిమిషాల ముందుగానే స్టేషన్ చేరుకొని బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. 2 నిమిషాల ఆలస్యంతో 09 : 47pm కి బస్సు స్టేషన్కి  చేరుకుంది. సాగర్ బస్సు ఎక్కి తన సీట్లో కూర్చున్నాడు. బస్సు100 మైళ్ళ వేగంతో ముందుకు సాగిపోతుండగా, సాగర్ 200 మైళ్ళ వేగంతో పెళ్లి అనే Dream లోకి జారుకున్నాడు.

“తన కలలో, ఎవరు కనపడని ఆ ప్రపంచంలో, ఎవరికోసమో వెతుకుతూ, అలసిపోయి, తన ప్రేయసి కోసమే వెతుకుతున్నానని తెలుసుకొని, తన కోసం తన అన్వేషణ మొదలుపెట్టాడు. స్పర్శ  కలిగించిన అనుభూతితో తన ప్రేయసిని తన కళ్ళ ముందు చూసుకుంటూ, మనసులో ఎక్కడో చిగురించిన ప్రేమను తనకు చెప్పాలని తహతహలాడుతూ, భయంతో వెనకడుగు వేస్తూ, చెప్పాలని కుతూహలంతో చెప్పేసాడు. ఆకాశమంత పందిరిలో, బంధుమిత్రుల సందడిలో, వేదమంత్రాల సాక్షిగా తాళి కట్టబోతుండగా......."


ఇంతలో ఎవడో విజయవాడ, విజయవాడ అని అరుస్తుండగా ఒక్కసారిగా ఉలిక్కిపడి, బస్సు విజయవాడ చేరుకుందని గమనించాడు.

No comments