Page Nav

HIDE

Grid

GRID_STYLE

Breaking News

latest

In Between the Love - Real-Life True Suspense Stories Chapter - 2

Hi, Love-Magics Readers Welcome to Our Website We are Writing Real True Story. This Story Is Written By Venkatesh Kusumanchi , Kumar Swami...

Hi, Love-Magics Readers Welcome to Our Website We are Writing Real True Story. This Story Is Written By Venkatesh Kusumanchi, Kumar Swami Shinagam
Note: If You Want to Publish Your Love Story Message Join Our Love Magics Group And Publish Your Story For Free 
Click Here )

      ఇద్దరం ఇంటికి వెళ్లిపోయాం, మళ్ళి ఆ అమ్మాయిని కలుసుకోవాలని ఆలోచనలు వస్తున్నాయి. 
        ఈ లోపు నా చెత్త Brain కి ఒక చెత్త ఆలోచన తట్టింది😅.
        వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా  ఆ అమ్మాయి నెంబర్ కి ‛Hii’ అని మెసేజ్ పెట్టేసాను. ఆ అమ్మాయి దగ్గరినుంచి వెంటనే కాల్📞📞 వచ్చింది!
         ఒక్కసారిగా కాల్ లిఫ్ట్ చెయ్యాలా  వద్దా అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేసేసాను .
        “చూచన లేని వడగళ్ళ వానల ఆ అమ్మాయి నన్ను చెడ మడ తిట్టేస్తుంది” ఫోన్లో'.
         ఈలోపు ఎం చెయ్యాలో అర్ధం కాక “Ummma” అని ముద్దు పెట్టేసాను ఫోన్లో , “అదే వడగళ్ళ వాన వల్ల⛈ ఆగిపోయిన IPL match ల తిట్లన్ని ఒక్కసారిగా ఆగిపోయాయి” .
         ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది అసలు, “ఎందుకిల తిడుతున్నారు?” అని అడిగాను.
         “నాకు ఎందుకు మళ్ళి Message చేశారు?” అని అడిగింది తను.
         “నేనా messajaa ! నేను మీకు Message పెట్టలేదండి” అని అన్నాను అమాయకంగ😟.
         మీరే కదండి ‛Hii అని Whatsapp లో Message’ పెట్టింది. మరి కాదంటారేంటి , మీ నెంబర్ తోనే వచ్చింది Message అని అడిగింది .
         “ఏమో అండి నేనైతే మీకు Message పెట్టలేదు, may be ఆ Hacker మళ్ళి Message చేసాడేమో” అని కవర్ చేసేసాను చెండాలంగ!
         అలా ఎదో ఒక సాకు వెతుకుతూ, తనతో మాట్లాడుతూ కొన్నిరోజులు గడిపేశాను .
         బహుశా! నాకు English భాషలో నచ్చిన పదాలన్ని ఒక వరుసలో పెడితే Hacking అనే పదం కచ్చితంగా మొదటి పదంగా ఉంటుందేమో! ఆ పదాన్ని వాడుకొని అలా నాలుగు నెలలు గడిపేశాను .
         తనకి చాలా దగ్గర అయిపోయాను .....
        కానీ తనను కలిసిన ప్రతిసారి ఎదో ఒక తెలియని వెలితి తన మొఖంలో కనిపించేది, అదే విషయం తనని అడిగాను .
        తను మా నాలుగు నెలల పరిచయం తరువాత తను నాకు చెప్పడానికి సిద్ధపడింది .
        తన మొఖంలో వెలితి ఏంటో తెలుసుకునే సమయం ఆసన్నమయింది .
        తను చెప్పబోయె సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.
        ఈలోపు ఉత్కంఠగా జరుగుతున్న Match మధ్యలోకి కుక్క పిల్ల🐕 అడ్డం వచ్చినట్టు, ఒక పిల్లవాడు🏃 పల్లీలు అమ్మడానికి వచ్చాడు .
        పల్లీలు వద్దు, ఏమి వద్దెహ్  వేళ్ళు అని, చిన్నపాటి కోపంతో😒 వాడిని పంపించేసాను .
        తను మల్లి చెప్పడానికి సిద్దపడింది .
        ఈలోపే వేడివేడిగా ఉన్న సాంబార్🍜 లోకి ఈగ🐝 పడినట్టు , అప్పటికే చిన్నపాటి కోపంలో ఉన్న నా దగ్గరికి “ఈత పళ్ళు, ఈత పల్లె” అనుకుంటూ ఒకరు మళ్ళి  ఇద్దరి మధ్యలోకి వచ్చాడు, ఈలోపే నా కోపం రెట్టింపు అయింది .
          నా కోపానికి ఆహుతి అవుతాడని తెలిసిందో ఏమో కానీ, వచ్చినవాడు వచ్చినట్టే తిరిగి “ఈత పళ్ళు, ఈత పల్లె” అనుకుంటూ ఈత పళ్ళు అమ్ముకోవడానికి వెళ్ళిపోయాడు.
          ఇదంతా చూసి తను చిన్నగా నవ్వింది😊. “ఏ మాటకి ఆమాటే చెప్పుకోవాలి కాని అమ్మాయిలు నవ్వినప్పుడు చాలా అందంగా వుంటారు”.
          ఈలోపే తను తన ‛STORY’ చెప్పడం Start చేసింది.........

Chapter - 3 will be release soon

1 comment